Gold Rate: కాస్త దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు పై చూపులు!

Gold Rate: నిన్న పెరుగుదల చూపించిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గాయి.

K V D Varma
Updated on: 21 July 2020 9:45 AM IST
gold and silver rate today 21st July
X
gold rate today (Representational image)

నిన్న పెరుగుదల చూపించిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 21) దేశీయంగా తగ్గుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (21.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 90 రూపాయలు తగ్గింది. దీంతో 46,950 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 90 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,240రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు తగ్గుదల నమోదు చేస్తే, వెండి ధరలు మాత్రం కొద్దిగా పైకెగాశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే 240 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53 వేల రూపాయల రికార్డు ధరకు చేరింది. దీంతో కేజీ వెండి ధర 53,150 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 90 రూపాయలు తగ్గింది. దీంతో 46,950 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 90 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,240రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే 50 రూపాయలు తగ్గి 47,850 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం ధరతో పోలిస్తే 60 రూపాయలు తగ్గింది. దీంతో 49,050 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 53 వేల రూపాయల రికార్డు ధరకు ఎగసింది. దీంతో కేజీ వెండి ధర 53,150 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story