Gold Rate: ఎగసిన బంగారం ధరలు..పెరిగిన వెండి ధరలు!

Gold Rate: రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా

K V D Varma
Updated on: 21 Feb 2021 6:00 AM IST
Gold and Silver Rate Today
X

ఈరోజు బంగారం ధరలు 

బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. శనివారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (ఫిబ్రవరి 21) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం (21.02.2021) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 43,250 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 280 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 47,180 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటె కాస్త పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 400 రూపాయలు పెరిగింది. దీంతో 73వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 73,800 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం (21.02.2021) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 43,250 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 280 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 47,180 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 250 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ధరతో పోలిస్తే 170 రూపాయలు పెరిగింది. దాంతో 49,430 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటే కాస్త పెరిగింది. ఈరోజు 300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 69వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరుకున్నాయి. దీంతో కేజీ వెండి ధర 69,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-02-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story