Gold Rate: ఎగసిన బంగారం ధరలు.. వెండి ధరలు అదే దారిలో!

Gold Rate: హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 20) దేశీయంగా పెరుగుదల నమోడుచేశాయి.

K V D Varma
Published on: 20 July 2020 8:47 AM IST
Today gold rate July 20th gold and silver rates
X
gold rate today (representational image)

గత వారాంతంలో కొద్దిగా తగ్గుతున్నట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 20) దేశీయంగా పెరుగుదల నమోడుచేశాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (20.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 190 రూపాయలు పెరిగింది. దీంతో 47,040 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 190 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,330రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు కూడా కొద్దిగా పైకేగాశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53 వేల రూపాయల రికార్డు ధరకు దగ్గరలోకి చేరింది. దీంతో కేజీ వెండి ధర 52,910 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 190 రూపాయలు పెరిగింది. దీంతో 47,040 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 190 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,330రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం ధరతో పోలిస్తే 200 రూపాయలు పెరిగి 47,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం ధరతో పోలిస్తే 210 రూపాయలు పెరిగింది. దీంతో 49,110 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 53 వేల రూపాయల రికార్డు ధర నుంచి కొద్దిగా కిందికి దిగింది. దీంతో కేజీ వెండి ధర 52,910 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story