Gold Rate: దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు కూడా కిందికే!

నిన్న పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 18) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి.

K V D Varma
Updated on: 18 July 2020 8:13 AM IST
Today july 18 gold rates
X
Gold Price today (representational image)

నిన్న పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 18) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శనివారం (18.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 330 రూపాయలు తగ్గింది. దీంతో 46,850 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 330 రూపాయలు తగ్గింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,140రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు తగ్గుదల నమోదు చేస్తే, వెండి ధరలు కూడా కొద్దిగా దిగివచ్చాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53 వేల రూపాయల రికార్డు ధర నుంచి కిందికి వచ్చింది. దీంతో కేజీ వెండి ధర 52,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 330 రూపాయలు తగ్గింది. దీంతో 46,850 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 330 రూపాయలు తగ్గింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,140రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరతో పోలిస్తే 250 రూపాయలు తగ్గి 47,950 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం ధరతో పోలిస్తే 250 రూపాయలు తగ్గింది. దీంతో 48,900 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53 వేల రూపాయల రికార్డు ధర నుంచి కొద్దిగా కిందికి దిగింది. దీంతో కేజీ వెండి ధర 52,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story