భారీగా దిగొచ్చిన బంగారం..వెండి ధరలు పతనం!

కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 18) ఒక్కసారిగా పడిపోయాయి. ఇక వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి.

K V D Varma
Published on: 18 April 2020 7:04 AM IST
భారీగా దిగొచ్చిన బంగారం..వెండి ధరలు పతనం!
X
gold and silver rate in India today (representational image)

కొంత కాలంగా పైపైకి పరుగులు తీస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. భారీగా తగ్గిపోయాయి. ఈరోజు (ఏప్రిల్ 18) బంగారం ధరలు పది గ్రాములకు 1680 రూపాయల వరకూ తగ్గాయి. మరో వైపు నిన్న కాస్త పెరిగినట్టు కనిపించిన వెండి ధరలు ఈరోజు కిందికి దిగొచ్చాయి. కేజీకి 690 రూపాయల భారీ తగ్గుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా కిందికి దిగోచ్చాయి. శనివారం (18.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 1500 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,600 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 1680 రూపాయల తగ్గుదలతో 44,290 రూపాయలు నమోదు చేసింది.

పడిపోయిన వెండి ధరలు...

బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా నిన్న కాస్త పెరిగినట్టు కనిపించిన వెండి ధరలు మాత్రం ఈరోజు భారీ తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 690 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు దగ్గరలో కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,200 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 1500 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,600 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 1680 రూపాయల తగ్గుదలతో 44,290 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,200 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు అదేవిధంగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1460 రూపాయల తగ్గుదలతో 44,640 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1940 రూపాయల తగ్గుదలతో 41,920 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 41 వేల మార్కుకు చేరువలో నిలిచింది. కేజీ వెండి ధర 41,200 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story