మరింత పైకి బంగారం ధరలు.. వెండి ధరలూ పెరిగాయి..
బంగారం ధరలు ఎక్కడా తగ్గడం లేదు. రోజు రోజుకూ పైపైకి కదులుతూనే ఉన్నాయి. ఈరోజు (ఏప్రిల్ 17) బంగారం ధరలు పది గ్రాములకు 210 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన వెండి ధరలు ఈరోజు కాస్త పైకి కదిలాయి. కేజీకి 40 రూపాయల పెరుగుదల కనబరిచాయి.
బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (17.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 140 రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,100 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 210 రూపాయల పెరుగుదలతో 45,970 రూపాయలు నమోదు చేసింది.
పెరిగిన వెండి ధరలు...
బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన వెండి ధరలు మాత్రం ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 40 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు దగ్గరలో కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,890 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 140 రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,100 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 210 రూపాయల పెరుగుదలతో 45,970 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,890 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో కూడా బంగారం ధరలు అదేవిధంగా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయల పెరుగుదలతో 46,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయల పెరుగుదలతో 43,860 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కుకు చేరువలో నిలిచింది. కేజీ వెండి ధర 41,890 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




