Gold Price: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరల మోత..!

నిన్నటి వరకూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 14) దేశీయంగా పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

K V D Varma
Published on: 14 July 2020 8:04 AM IST
Gold Price: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరల మోత..!
X

నిన్నటి వరకూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 14) దేశీయంగా పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (14.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే పెరియి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 60 రూపాయలు పెరిగింది. దీంతో 46,960 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 60 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,240రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే 210 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52 వేల రూపాయల రికార్డు ధరకు చేరుకుంది. దీంతో కేజీ వెండి ధర 52,210 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే పెరియి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 60 రూపాయలు పెరిగింది. దీంతో 46,960 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 60 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,240రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరియి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే 40 రూపాయలు పెరిగి 47,850 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం ధరతో పోలిస్తే 40 రూపాయలు పెరిగింది. దీంతో 49,050 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 210 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 51వేల రూపాయల మార్కు దాటి 52 వేల రూపాయల రికార్డు ధరవైపు దూసుకెళ్లింది. దీంతో కేజీ వెండి ధర 52,210 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 14-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story