Gold Rate Today: పైకెగసిన బంగారం..వెండి కూడా అదేబాట!

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

K V D Varma
Updated on: 14 Feb 2020 11:15 AM IST
Gold Rate Today: పైకెగసిన బంగారం..వెండి కూడా అదేబాట!
X
GOld And Silver File Photo

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 240 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 40 150 రూపాయల నుంచి 42',390 రూపాయలకు చేరుకుంది . ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 280 రూపాయలు పెరిగింది దీంతో 38,600 రూపాయల నుంచి 38,880 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పైకెగసింది.

వెండి ధరలు కూడా పైకే!

బంగారం ధరల దారిలోనే వెండి ధరలు పయనించాయి. కేజీ వెండి ధర 200 రూపాయలు పెరిగింది . దీంతో నిన్నటి వెండి ధర 48,800 నుంచి 49,000 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 42'390 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 38,880 రూపాయలు నమోదు చేశాయి. కాగా' వెండి ధర లు ఇక్కడా పెరిగాయి దీంతో కెజీ వెండీ 49,000 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో...

ఇక, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర లు పైకెగశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 40,900 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 250 రూపాయలు పెరగడంతో 39,600 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర కూడా 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి 49,000 రూపాయలు గా నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 14-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story