Gold Rate:బంగారం ధరలు పతనం..వెండి ఢమల్! ఎంత తగ్గాయంటే..

Gold Rate:ఒక్కసారిగా బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. వెండి ధరలు అంతకు మించి పతనం అయ్యాయి.

K V D Varma
Published on: 13 Aug 2020 7:38 AM IST
Gold Rate:బంగారం ధరలు పతనం..వెండి ఢమల్! ఎంత తగ్గాయంటే..
X
gold rate today

పై పైకి కదలడమే తప్ప కిందికి కదలడానికి మొరాయించిన బంగారం ధరలు గత నాలుగురోజులుగా కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ఒక్కసారిగా భారీస్థాయిలో పతనం అయ్యాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు అమాంతం కిందికి దిగివచ్చాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 13) దేశీయంగా భారీ తగ్గుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు పైకి ఎగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (13.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే భారీగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 3010 రూపాయలు తగ్గింది. దీంతో 50,130 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 3350 రూపాయలు తగ్గింది. దీంతో 54,680 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పడిపోయాయి!..

బంగారం ధరలు ఒక్కసారిగా పతనం అయితే, అదే దారిలో వెండి ధరలు కూడా భారీ తగ్గుదల కనబరిచాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే భారీగా దిగివచ్చాయి. ఈరోజు 7500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల వద్దకు వెండి పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర 65,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే భారీగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 3010 రూపాయలు తగ్గింది. దీంతో 50,130 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 3350 రూపాయలు తగ్గింది. దీంతో 54,680 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ధరతో పోలిస్తే 3200 రూపాయలు తగ్గి 50,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం ధరతో పోలిస్తే 200 రూపాయలు తగ్గింది. దీంతో 54,500 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా బుధవారం నాటి ధరల కంటే భారీగా దిగివచ్చాయి. ఈరోజు 7500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల వద్దకు వెండి పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర 65,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story