Gold Rate: కాస్త తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు! లేటెస్ట్ గా ఇలా!

Gold Rate: బంగారం ధరలు దేశీయంగా కొద్దిపాటి తగ్దగుల కనబరిచాయి. వెండి ధరలు కూడా కొద్దిగా కిందికి కదిలాయి.

K V D Varma
Published on: 12 Sept 2020 8:55 AM IST
Gold Rate: కాస్త తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు! లేటెస్ట్ గా ఇలా!
X

Gold Rate Today

రెండురోజులుగా పెరుగుతూ వస్తున్నబంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 12) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శనివారం (12.09.2020) బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయలు తగ్గి 48,980 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 290 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,430 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొద్దిపాటి తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 580 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,980 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పపది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయలు తగ్గి 48,980 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 290 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,430 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ధరతో పోలిస్తే 350 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ధరతో పోలిస్తే 390 రూపాయలు దిగివచ్చింది. దాంతో 54,430 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 580 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,980 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story