Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు!

K V D Varma
Updated on: 12 March 2020 11:26 AM IST
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు!
X
gold rate today : representational image

బంగారం ధరలు ఈ వారం దోబూచులాడుతున్నాయి. సోమ మంగళ వారాల్లో స్వల్ప తగ్గుదలను నమోదు చేసిన బంగారం..నిన్న పెరుగుదల నమోదు చేసి షాకిచ్చింది. అయితే, ఈరోజు మళ్ళీ స్వల్ప తగ్గుదల నమోదు చేసి శుభవార్త అందించింది.

హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (12.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 320 రూపాయల తగ్గుదల నమోదు చేసి 41,840 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 280 రూపాయల తగ్గుదలతో 45,700 రూపాయలు నమోదు చేసింది.

భారీగా తగ్గిన వెండి ధరలు...

నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. దీంతో 50 వేల మార్కునుంచి దిగొచ్చిన కేజీ వెండి ధర నిన్నటి ధర 48,500 రూపాయల వద్ద స్థిరంగా నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 320 రూపాయల తగ్గుదల నమోదు చేసి 41,840 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 280 రూపాయల తగ్గుదలతో 45,700 రూపాయలు నమోదు చేసింది. అదేవిధంగా వెండి ధరలు కూడా భారీగా తగ్గడంతో కేజీకి 48,500 రూపాయలుగా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగోచ్చాయి.. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయల తగ్గుదలతో 43,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయల తగ్గుదలతో 42,850 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా స్థిరంగా 48,500 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story