Gold Rate: ఈరోజూ బంగారం ధరలు మరికాస్త కిందికి.. పెరిగిన వెండి ధరలు

Gold Rate: బంగారం ప్రియులకు శుభవార్త. ఈరోజు కూడా బంగారం ధరలలో తగ్గుదల కనిపించింది.ఇక వెండి ధరలు భారీస్థాయిలో పడిపోయాయి.ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Samba Siva Rao
Updated on: 10 March 2021 12:00 PM IST
Gold rate Today Hyderabad Amaravathi
X

Gold rate Today

Gold rate:బంగారం ధరలు మంగళవారం తగ్గుదల కనబరిచాయి. దీంతో బుధవారం మార్కెట్లు తగ్గుదలతో ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (09.03.2021) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిపాటి తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజూ కాస్త కిందికి దిగివచ్చాయి. బుధవారం (10.03.2021) బంగారం ధరలు మంగళవారం నాటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 350 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41,650 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర 45 వేలరూపాయల మార్క్ వద్దకు దిగివచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 380 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,440 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు పెరుగుదల..

బంగారం ధరలు కాస్త తగ్గితే.. వెండి ధరలు స్పల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరకంటె 100 రూపాయలు పెరిగింది. దీంతో 71 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,100 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజూ కాస్త కిందికి దిగివచ్చాయి. బుధవారం (10.03.2021) బంగారం ధరలు మంగళవారం నాటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 350 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41,650 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 45వేలరూపాయల మార్క్ వద్దకు నిలిచింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 380 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,440 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 350 రూపాయలు తగ్గి 43,800 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల కనబరిచింది. ఇక్కడ 380 రూపాయలు తగ్గి 47,780 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీలో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 100 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 66 వేల రూపాయల స్థాయిలో నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,700 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-03-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story