Gold Rate: బంగారం ధరలు కాస్త కిందికి.. వెండి ధరలు మరికాస్త పైకి..తాజా రేట్లివే!

Gold Rate: బంగారం ధరలు ఈరోజు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. వెండి ధరలు మాత్రం మళ్ళీ పైకేగాసాయి.

K V D Varma
Published on: 8 Sept 2020 7:02 AM IST
Gold Rate: బంగారం ధరలు కాస్త కిందికి.. వెండి ధరలు మరికాస్త పైకి..తాజా రేట్లివే!
X

తక్కువ స్థాయిలో బంగారం ధరలుతరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 08) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (08.09.2020) బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 40 రూపాయలు తగ్గి 48,850 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 30 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,290 రూపాయల వద్దకు చేరింది.

వెండి ధరలు పైపైకి..

బంగారం ధరలు తగ్గుదల చూపిస్తే, వెండి ధరలు కొంతమేర పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 890 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,100 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 40 రూపాయలు తగ్గి 48,850 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 30 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,290 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ధరతో పోలిస్తే 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,650 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ధరతో పోలిస్తే 50 రూపాయలు ఎగసింది. దాంతో 54,160 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 890 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,100 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story