స్థిరంగా బంగారం వెండి ధరలు... ఈ రొజు ఇలా!
గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి.
గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. ఈరోజు (మే 8) బంగారం ధరల్లో దేశీయంగా ఎటువంటి మార్పు లేదు. మరో వైపు వెండి ధరలు ఈరోజూ పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం(08.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరలో ఎటువంటి మార్పు లేదు. నేడు కుడా స్థిరంగా కొనాసాగుతూ 44,140 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు ధరలో కుడా మార్పు లేదు 46,900 రూపాయలు నమోదు చేసింది.
స్వల్పంగా పెరిగిన వెండి ధరలు...
బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు మాత్రం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. కేజీకి 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు వద్దకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 42,050 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరలో ఎటువంటి మార్పు కనబరచకుండా 44,140 రూపాయలు వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు ధరలో కుడా మార్పు లేకుండా 46,900 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా పెరిగాయి దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 42,050 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 44,700 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 42,050 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




