Gold Rate Today: బంగారం ధరకు రెక్కలు.. అదే బాటలో వెండి

వారంతంలో దేశీయ మార్కెట్లు వరస లాభాలకు బ్రేక్ పడటంతో బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చాయి.

K V D Varma
Updated on: 8 Feb 2020 11:25 AM IST
Gold Rate Today: బంగారం ధరకు రెక్కలు.. అదే బాటలో వెండి
X

బంగారాని ధరకి మళ్లి రెక్కలు వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో వరుసగా పెరుగుదల నమోదు చేసి కంగారు పుట్టించిన పసిడి ఈ మధ్య కింది చూపులు చూస్తూ వస్తోంది. అదే వరుసలో ఈ రోజు కూడా బంగారం పెరిగింది. నిన్నటి ధరల కంటే ఈరోజు (08.02.2020) మరింత బంగారం ధర పెరిగింది.

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 450 రూపాయలు పెరిగింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,330 గావుంది.. శుక్రవారం 41,880 రూపాయలకు నుంచి పెరిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 350 రూపాయలు పెరగడంతో 38,380 నుంచి 38,730 రూపాయల వద్దకు చేరుకుంది.

పెరిగిన వెండి..

వెండి ధరలు.. ఒకవైపు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా, వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి ధరలు కేజీకి 500 పెరిగింది. దీంతో వెండి ధరలు కేజీకి 48,500 రూపాయల వద్దనిలిచాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,330 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,730 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 48,500 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 300 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,700 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,500 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా తగ్గింది.. దాంతో వెండి ధర కేజీకి 48,500 రూపాయలుగా ఉంది. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08.02.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.

K V D Varma

K V D Varma

Next Story