Top
logo

Gold Rate: పెరుగుతూనే ఉన్న బంగారం ధరలు.. అదే దారిలో వెండి ధరలు!

Gold Rate: పెరుగుతూనే ఉన్న బంగారం ధరలు.. అదే దారిలో వెండి ధరలు!
X
Highlights

కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు (ఏప్రిల్ 5) బంగారం...

కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు (ఏప్రిల్ 5) బంగారం ధరలు పది గ్రాములకు 70 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కేజీకి 90 రూపాయల పెరుగుదల కనబరిచాయి.

బంగారం ధరలు నాలుగురోజుల తరువాత కూడా పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (06.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 70 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,030 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు ఏకంగా 50 రూపాయల పెరుగుదలతో 43,030 రూపాయలు నమోదు చేసింది.

మళ్ళీ పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరల తో పాటూ, వెండి ధరలు కూడా మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 90 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,360 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 70 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,030 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 50 రూపాయల పెరుగులతో 44,030 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా పెరిగాయి. వెండి ధర 40,360 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60 రూపాయల భారీ పెరుగుదలతో 44,260 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయల పెరుగుదలతో 41,960 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. 40 వేల మార్కు దాటి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,360 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.





Web Titlegold-rate-today-06-04-2020-silver-rate-gold-rate-hyderabad-delhi-vijayawada-amaravathi
Next Story