Gold Rate:స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..వెండి ధరలు కిందికి!

Gold Rate:నిన్న కొంత తగ్గిన బంగారం ధరలు ఈరోజూ కాస్త దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 04) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి.

K V D Varma
Published on: 4 July 2020 7:15 AM IST
Gold Rate:స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..వెండి ధరలు కిందికి!
X

నిన్న కొంత తగ్గిన బంగారం ధరలు ఈరోజూ కాస్త దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 04) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొంత తగ్గుదల నమోదు చేశాయి. శనివారం (04.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 60 రూపాయలు తగ్గింది. దీంతో 46,270 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 60 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,880 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48 వేల రూపాయల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 48,550 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 60 రూపాయలు తగ్గింది. దీంతో 46,270 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 60 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,880 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం ధరతో పోలిస్తే మార్పులు లేకుండా 47,150 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం ధర వద్ద కదలకుండా ఉంది. దీంతో 48,350 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 50 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 48 వేల రూపాయల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 48,550 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story