Gold Rate: పెరిగిన బంగారం ధరలు..ఎగసిన వెండి ధరలు.. ఈరోజు ధరల తీరిలా!

Gold Rate: నిన్న కాస్త బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. ఇక వెండి ధరలు కూడా ఈరోజు కొద్దిగా పెరిగాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

K V D Varma
Published on: 3 Oct 2020 7:52 AM IST
Gold Rate: పెరిగిన బంగారం ధరలు..ఎగసిన వెండి ధరలు.. ఈరోజు ధరల తీరిలా!
X

నిన్న కొద్దిగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పై చూపులు చూశాయి. బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (03.10.2020) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజూ కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (03.10.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పెరిగి 48,370 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 120 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,760 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా పెరిగాయి. ఈరోజు 500 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 61 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 61,200 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శనివారం (03.10.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పెరిగి 48,370 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 120 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,760 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 250 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 250 రూపాయలు పెరిగింది. దాంతో 53,670 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడ కూడా వెండి ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా పెరిగాయి. ఈరోజు 500 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 61,200 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story