Gold Rate:కాస్త దిగొచ్చిన బంగారం ధరలు..వెండి ధరలు తగ్గాయి!

నిన్న ఒక్కసారిగా పైకెగసిన బంగారం ధరలు ఈరోజు దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 03) Gold Rate:దేశీయంగా తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి.

K V D Varma
Published on: 3 July 2020 7:50 AM IST
Gold Rate:కాస్త దిగొచ్చిన బంగారం ధరలు..వెండి ధరలు తగ్గాయి!
X

నిన్న ఒక్కసారిగా పైకెగసిన బంగారం ధరలు ఈరోజు దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 03) దేశీయంగా తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొంత తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం (03.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 410 రూపాయలు తగ్గింది. దీంతో 46,330 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,940 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే ఏకంగా 1450 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో ఒక్కసారిగా 50 వేల రూపాయల రికార్డు మార్కు నుంచి కిందికి పడిపోయింది. కేజీ వెండి ధర 48,600 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 410 రూపాయలు తగ్గింది. దీంతో 46,330 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,940 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం ధరతో పోలిస్తే 400 రూపాయలు తగ్గి 47,150 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం ధర కంటే 400 రూపాయలు తగ్గింది. దీంతో 48,350 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 1500 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఒక్కసారిగా 50 వేల రూపాయల రికార్డు మార్కు నుంచి కిందికి పడిపోయింది. కేజీ వెండి ధర 48,600 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story