Gold Rate:బంగారం ధరల మోత! వెండి ధరల వాత!

K V D Varma
Published on: 2 July 2020 7:37 AM IST
Gold Rate:బంగారం ధరల మోత! వెండి ధరల వాత!
X

ఒక్కసారిగా బంగారం ధరలు పైకెగాశాయి. హైదరాబాద్ లో భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 02) దేశీయంగా పెరుగుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీగా రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కాస్త పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (02.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 470 రూపాయలు పెరిగింది. దీంతో 46,740 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 470 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,950 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే ఏకంగా 1550 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో ఒక్కసారిగా 50 వేల రూపాయల రికార్డు మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 50,050 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 470 రూపాయలు పెరిగింది. దీంతో 46,740 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 470 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,950 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ధరతో పోలిస్తే 450 రూపాయలు పెరిగి 47,550 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం ధర కంటే 450 రూపాయలు పెరిగింది. దీంతో 48,750 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 1500 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 50వేల మార్కుకు ఎగసి 50,050 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story