Gold Rate:బంగారం ధరలు కొద్దిగా కిందికి.. వెండి ధరలు కొంచెం పైకి!

K V D Varma
Published on: 1 July 2020 7:38 AM IST
Gold Rate:బంగారం ధరలు కొద్దిగా కిందికి.. వెండి ధరలు కొంచెం పైకి!
X

వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు హైదరాబాద్ లో స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 01) దేశీయంగా తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (01.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 180 రూపాయలు తగ్గింది. దీంతో 46,270 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,480 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,550 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 180 రూపాయలు తగ్గింది. దీంతో 46,270 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,480 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే 150 రూపాయలు తగ్గి 47,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం ధర కంటే 150 రూపాయలు తగ్గింది. దీంతో 48,300 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 50 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కుకు ఎగసి 48,550 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story