Gold Rate: ఒక్కరోజులోనే 10 గ్రాములకు రూ.1202 పెరిగిన ధర

Gold Rate: ఢిల్లీలో 10 గ్రా. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.51, 889

Rama Rao
Updated on: 2 March 2022 9:30 PM IST
Gold Prices in Delhi | Telugu Online News
X

ఒక్కరోజులోనే 10 గ్రాములకు రూ.1202 పెరిగిన ధర 

Gold Rate: ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేట దాడి చేస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు, బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడుతోంది. అంతర్జాతీయ విపణిలో ధరలు పెరగడంతో పాటు, రూపాయి విలువ క్షీణిస్తుండడంతో దేశీయంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ఏకంగా 1202 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో తులం మేలిమి బంగారం ధర 51, 889 రూపాయలుగా ఉంది. అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. ఢిల్లీలో కిలో వెండి ధర 2,148 పెరిగి 67, 956కు చేరింది.

Rama Rao

Rama Rao

Next Story