వారంలో 2200 తగ్గిన బంగారం ధర..

వారంలో 2200 తగ్గిన బంగారం ధర..
x
Highlights

పోయిన వారంతో పోల్చుకుంటే బంగారం ధర ఈ వారం రెండువేలకు పైగా తగ్గింది. భవిష్యత్ లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బంగారం, వెండి ధరలు క్రితం వారం ముగింపుతో పోల్చుకుంటే 2200 రూపాయలు తగ్గాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే బలమైన రూపాయి వంటి అంశాలు పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

బంగారం ధర గత వారపు 39,885రూపాయల ధరతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా రూ.2,200 తగ్గింది. వెండి ధర కూడా తగ్గుతూనే వస్తోంది. గత వారపు 51,489 రూపాయల ధరతో పోలిస్తే వెండి ధర దాదాపు 8 శాతం పతనమైంది.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర స్తబ్దుగానే కొనసాగుతోంది. ఔన్స్‌కు 1,499 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 1,550 డాలర్ల స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి చూస్తే బంగారం ధర దాదాపు 4 శాతం పడిపోయింది. వెండి ధర ఔన్స్‌‌కు 18 డాలర్ల వద్ద కదలాడుతోంది. రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడటం వల్ల బంగారం, వెండి ధరలపై ఒత్తిడి నెలకొంది. అయితే భవిష్యత్‌లో బంగారం ధర పెరగొచ్చని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. దేశీ మార్కెట్ విషయానికి వస్తే.. బంగారం ధరల తగ్గుదల కలిసొచ్చే అంశామని జువెలరీ డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. పండుగ సీజన్ మరో సానుకూల అంశమని అభిప్రాయపడింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories