Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: పసిడిప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి కొనాలని ప్లాన్ లో ఉంటే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు శుక్రవారం ఉదయం నాటికి 24,22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 తగ్గింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Aug 2024 6:51 AM IST
Gold and Silver Rates Today august 16th 2024 Hyderabad
X

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ లో ఉన్నవారికి అదిరిపోయే వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు శుక్రవారం ఉదయం వరకు 24,22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 250 తగ్గింది. దీంతో ముంబైలో 24క్యారెట్ల గోల్డ్ ధర పది గ్రాములకు రూ. 71,500గా ఉంది. 22 క్యారెట్లు బంగారం ధర పది గ్రాములకు రూ. 65,540కి చేరుకుంది.

ఇక ఢిల్లీలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,650 చేరగా..22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 65,690గా ఉంది. హైదరాబాద్ , విజయవాడలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,500కి చేరింది. 22క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 65,540కి చేరింది. అయితే బడ్జెట్ కు ముందు బంగారం ధర పది గ్రాములకు దాదాపు రూ. 75,000ఉంది. అయితే బంగారంపై కస్టమ్ డ్యూటీని 15శాతం నుంచి 6శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే గోల్డ్ ప్రైస్ పడిపోయిన ఇప్పటి వరకు మాత్రం పాత స్థాయికి చేరుకోలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story