Gold and Silver prices today : దేశంలో మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..వెండి మాత్రం నేలచూపు

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. వెండి మాత్రం తగ్గుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2024 6:38 AM IST
Gold Rate Today octomber 3rd 2024 gold and silver price check details here
X

Gold Rate Today: పసిడి ప్రియులకు సడెన్ షాకిచ్చిన బంగారం ధర..ఎంత పెరిగిందంటే

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు నేడు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగింది. దీంతో 71,460కి చేరుకుంది. గురువారం ఈ ధర రూ. 71,450గా ఉంది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. దీంతో రూ. 7,14,600కి చేరుకుంది. ఒక గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ. 7,164గా కొనసాగుతోంది.

మరోవైపు 24క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 77, 960కి చేరుకుంది. కిందటి రోజు ఈ ధర రూ. 77,950గా ఉంది. అదే సమయంలో వంద గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి..రూ. 7, 79, 600గా ఉంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,610గాను, 24క్యారెట్ల బంగారం ధర రూ. 78, 110గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22క్యారెట్ల బంగారం ధర రూ. 71,460 పలుకుతుండగా..24క్యారెట్ల బంగారం ధర రూ 77, 960గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం 22క్యారట్ల బంగారం ధర రూ. 71,460గా ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 77,960 నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

అటు వెండి ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం వంద గ్రాముల వెండి ధర రూ. 9,190గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 91,900వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 92,000గా ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 1,00, 900 పలుకుతోంది. వెండి ధరలు కోల్ కతా, బెంగళూరులో కూడా ఈవిధంగానే ఉన్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story