Gold Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
x
Highlights

* నిన్న కొద్దిగా తగ్గిన బంగారం ధర అత్యంత స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. 19.10.2019 శనివారం బంగారం పది గ్రాములకు 20 రూపాయలు పెరిగింది. * శుక్రవారం స్థిరంగా ఉన్న వెండి ధరలు శనివారం కొద్దిగా పెరిగాయి. * శనివారం దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి.

నిన్న కొద్దిగా తగ్గిన బంగారం ధర అత్యంత స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. 19.10.2019 శనివారం బంగారం పది గ్రాములకు 20 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం 40 వేల రూపాయల మార్కు నుంచి కొద్దిగా పైకి చేరింది. శుక్రవారం స్థిరంగా ఉన్న వెండి ధరలు శనివారం కొద్దిగా పెరిగాయి.శనివారం దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి.

శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 20 రూపాయలు పెరిగి, 40,020 రూపాయలైంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 20 రూపాయలు పెరిగింది. దీంతో 36,680 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర కేజీకి 500 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,800 రూపాయల కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,020 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,680 రూపాయలుగానూ ఉన్నాయి

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాముల ధర స్థిరంగా ఉంది. నిన్నటి 38,650 రూపాయల వద్ద 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా స్థిరంగా ఉంది. దీంతో 37,450 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధర కేజీకి 500 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,000 రూపాయలు కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories