Gold Rates today: రెండో రోజూ పైకెగసిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి!

Gold Rates today: రెండో రోజూ పైకెగసిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి!
x
Highlights

రెండో రోజూ బంగారం ధరలు పైకి కదిలాయి. 17.10.2019 గురువారం బంగారం పది గ్రాములకు 60 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం 40 వేల రూపాయల మార్కును...

రెండో రోజూ బంగారం ధరలు పైకి కదిలాయి. 17.10.2019 గురువారం బంగారం పది గ్రాములకు 60 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం 40 వేల రూపాయల మార్కును దాటే నిలిచింది. అంతర్జాతీయంగా భారీగా పెరిగిన బంగారం ధరల ప్రభావం దేశీయ మార్కెట్ మీద కూడా పడింది. ఇక నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. గుర్వారమూ దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.

గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 60 రూపాయలు పెరిగి 40,110 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 60 రూపాయలు పెరిగింది. దీంతో 36,780 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర స్థిరంగా ఎటువంటి మార్పులూ లేకుండా ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,500 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,110 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,780 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉండడం విశేషం. నిన్నటి ధర 38,700 రూపాయల వద్దే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా ఏ మార్పులు లేకుండా 37,500 రూపాయల వద్దే ఉంది. ఇక కేజీ వెండి ధర మార్పులు లేకుండా 47,500 రూపాయలవద్ద స్థిరంగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories