Gold Price Today: బంగారం ధర తగ్గింది.. వెండి నిలకడగా ఉంది!

Gold Price Today: బంగారం ధర తగ్గింది.. వెండి నిలకడగా ఉంది!
x
Highlights

రెండు రోజులుగా పైకి కదిలిన బంగారం ధరలు ఈరోజు కొంత తగ్గాయి. 18.10.2019 శుక్రవారం బంగారం పది గ్రాములకు 110 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం 40 వేల రూపాయల మార్కు వద్ద నిలిచింది.

రెండు రోజులుగా పైకి కదిలిన బంగారం ధరలు ఈరోజు కొంత తగ్గాయి. 18.10.2019 శుక్రవారం బంగారం పది గ్రాములకు 110 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం 40 వేల రూపాయల మార్కు వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా తగ్గుతూ వస్తున్నబంగారం ధరల ప్రభావం దేశీయ మార్కెట్ మీద కూడా పడింది. ఇక రెండోరోజూ వెండి ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం దేశీయంగా బంగారం ధరలు తరుగుదలను నమోదు చేశాయి.

శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు110 రూపాయలు తగ్గి, 40,000 రూపాయలైంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 120 రూపాయలు తగ్గింది. దీంతో 36,660 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర స్థిరంగా ఎటువంటి మార్పులూ లేకుండా ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,500 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,000 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,660 రూపాయలుగానూ ఉన్నాయి

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 50 రూపాయలు తగ్గింది. దీంతో 38,650 రూపాయల వద్ద 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 50 రూపాయలు తగ్గింది. దీంతో 37,450 రూపాయల వద్దకు దిగింది. ఇక కేజీ వెండి ధర మార్పులు లేకుండా 47,500 రూపాయలవద్ద స్థిరంగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories