Gautam Adani: ఏమాత్రం తగ్గని గౌతమ్ అదానీ దూకుడు

*రూ.10.94 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో అదానీ

Rama Rao
Updated on: 21 Sept 2022 9:30 PM IST
Gautam Adani tops IIFL Wealth Hurun list of Richest Indians
X

Gautam Adani: ఏమాత్రం తగ్గని గౌతమ్ అదానీ దూకుడు

Gautam Adani: అపర కుబేరుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 10 లక్షల 94 వేల కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అదానీ అవతరించారు. తాజా జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. గత ఏడాదిలో అదానీ సంపద 116 శాతం పెరిగినట్టు IIFL వెల్త్ వెల్లడించింది. అంటే రోజుకు సగటున వెయ్యి 612 కోట్ల చొప్పున సుమారు 5 లక్షల 88 వేల కోట్ల మేర సంపద పెరిగింది. ఇక కొవిడ్ వ్యాక్సిన్ల ఫేమ్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాల సంపద 2 లక్షల కోట్లకు చేరింది. IIFL జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు.

Rama Rao

Rama Rao

Next Story