Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బంపర్‌ ఆఫర్.. కేవలం 22 వేలకే లక్ష ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్‌..!

Flipkart Bumper Offer Samsung Galaxy S22 Plus for Only 22 Thousand
x

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బంపర్‌ ఆఫర్.. కేవలం 22 వేలకే లక్ష ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్‌..!

Highlights

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై బంపర్‌ ఆఫర్‌లు అందిస్తోంది.

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై బంపర్‌ ఆఫర్‌లు అందిస్తోంది. ముఖ్యంగా Samsung Galaxy S22 Plus కొనుగోలుపై సూపర్‌ డిస్కౌంట్‌ని ప్రకటించింది. రూ.లక్ష విలువైన ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.22,000కే పొందవచ్చు. ఇది Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ సపోర్ట్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 128 GB, 256 GB రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy S22 Plus ధర రూ. 1,01,999 పలుకుతోంది. అయినప్పటికీ ఇది ఫ్లిప్‌కార్ట్‌లో 46 శాతం తగ్గింపుతో రూ. 54,999కి అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 30,000 డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తున్నారు. అప్పుడు ఈ ఫోన్ ధర రూ.24,999గా ఉంటుంది. కానీ ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మరో 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అంటే రూ. 2499 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు దీని ధర కేవలం రూ. 22,500 అవుతుంది.

Samsung Galaxy S22 Plusని EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం ప్రతి నెలా రూ.9,167 ఈఎంఐగా చెల్లించాలి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే 1 సంవత్సరం వారంటీ లభిస్తుంది. Samsung Galaxy S22 Plus 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అదే సమయంలో 12 MP, 10 MP రెండు కెమెరాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా ముందు భాగంలో 10MP కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4500 mAh బ్యాటరీ సపోర్ట్‌ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories