డ్రోన్ ఇన్సూరెన్స్ గురించి మీకు తెలుసా.. పరిహారం ఎలా పొందుతారో తెలుసుకోండి..!
Drone Insurance: మీరు డ్రోన్‌కి సంబంధించి వ్యాపారం చేస్తుంటే లేదా డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తుంటే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది.
డ్రోన్ ఇన్సూరెన్స్ గురించి మీకు తెలుసా.. పరిహారం ఎలా పొందుతారో తెలుసుకోండి..!
Drone Insurance: మీరు డ్రోన్‌కి సంబంధించి వ్యాపారం చేస్తుంటే లేదా డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తుంటే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. దేశంలో డ్రోన్ల వినియోగం వేగంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం భారత తపాలా శాఖలో డ్రోన్ల పంపిణీని ప్రారంభించింది. అదే సమయంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు నిత్యావసర వస్తువుల డెలివరీ కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రమాదం జరిగితే దాని వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి డ్రోన్ ఇన్సూరెన్స్ వచ్చింది. కార్లు, బైక్‌ల మాదిరిగానే డ్రోన్‌లకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
డ్రోన్ బీమా ఎందుకు..?
కారు, బైక్‌కు బీమా చేయడం అత్యవసరం. తద్వారా మీరు ప్రమాదం జరిగినప్పుడు నష్టాన్ని నివారించవచ్చు. డ్రోన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దేశంలో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇవి ప్రమాదాలకి గురవుతున్నాయి. వీటి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు.. అందుకే డ్రోన్‌కు బీమా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు వస్తువుల డెలివరీ కోసం, పెళ్లి వీడియోలను కవర్ చేయడానికి, టీవీ ఛానెల్, వినోదం, వ్యవసాయం, సర్వే వంటి రంగాలలో డ్రోన్ల ట్రెండ్ చాలా పెరిగింది.
నియమాలు
దేశంలోని డ్రోన్ రూల్స్-2021 ప్రకారం 250 గ్రాముల కంటే పెద్ద అన్ని డ్రోన్‌లకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేశారు. 1988 నాటి మోటారు వాహనాల చట్టంలోని అదే నిబంధనలు డ్రోన్‌ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి, ప్రాణాలకు లేదా ఆస్తికి నష్టం జరిగినప్పుడు వర్తిస్తాయి. డ్రోన్‌ను ఎగురుతున్నప్పుడు ఆస్తికి నష్టం లేదా వ్యక్తులకు గాయం అయినప్పుడు థర్డ్ పార్టీ బీమా కింద నష్టాన్ని భర్తీ చేస్తారు. దేశంలో డ్రోన్ బీమా ఇప్పుడే ప్రారంభమైంది. కొన్ని సంస్థలు దీనికి కవరేజీని అందిస్తున్నాయి. HDFC ERGO, ICICI లాంబార్డ్, బజాజ్ అలయన్జ్, టాటా AIG, న్యూ ఇండియా అస్యూరెన్స్ డ్రోన్‌లపై బీమా కవరేజీని అందిస్తున్నాయి.




