8th Pay Commisson: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపి కబురు.. ఇక జీతాలు రెట్టింపు

8th Pay Commisson: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపి కబురు.. ఇక జీతాలు రెట్టింపు
x
Highlights

8th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపి కబురందించింది. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న ప్రకటన ఇప్పుడు చేసింది. 8వ పే కమిషన్...

8th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపి కబురందించింది. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న ప్రకటన ఇప్పుడు చేసింది. 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్తను అందించింది కేంద్రంలోని మోదీ సర్కార్. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలను వెల్లడించారు. 8వ వేతన సంఘం ఏర్పాటు చేసిన అనంతరం తుది నివేదికను 2026లో సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ మేరకు 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, కరువు భత్యం, పెన్షన్లు వంటివి కూడా పే కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిసిందే. ప్రస్తుతం 7వ పే కమిషన్ అమల్లో ఉంది. అయితే ఈ పే కమిషన్ ఏర్పాటై 10ఏళ్ల పూర్తవుతున్న క్రమంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు పలు సందర్భాల్లో కేంద్రానికి వినతులు పంపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1, 2025 రోజున ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ లో దీనిపై ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ అంతకన్నా ముందే కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 8వ పే కమిషన్ అమల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగుల కనీస వేతనం రూ. 34వేలకు పెరిగే ఛాన్స్ ఉంది. కనీస పెన్షన్ కూడా రూ. 17వేలపైన అందుతుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories