ఉద్యోగులకి బంపర్‌ ఆఫర్.. ఈ బ్యాంకు అందిస్తున్న ప్రయోజనాలు తెలిస్తే..!

ఉద్యోగులకి బంపర్‌ ఆఫర్.. ఈ బ్యాంకు అందిస్తున్న ప్రయోజనాలు తెలిస్తే..!

Rama Rao
Updated on: 18 Jun 2022 11:31 AM IST
Bumper offer for Kotak Mahindra Bank Employees See Details
X

ఉద్యోగులకి బంపర్‌ ఆఫర్.. ఈ బ్యాంకు అందిస్తున్న ప్రయోజనాలు తెలిస్తే..!

Kotak Mahindra Bank: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే కొటక్‌ మహీంద్రా బ్యాంకు మీకు పెద్ద ప్రయోజనాలను అందిస్తుంది. దీని కింద మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చు. 'కోటక్ నేషన్ బిల్డర్స్' పథకం కింద సాలరీ అకౌంట్‌ ఓపెన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్‌ పొందవచ్చు. ఎందుకంటే ఈ ప్రత్యేక సాలరీ అకౌంట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు కూడా ఈ సాలరీ అకౌంట్‌ని ఓపెన్‌ చేయవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగులు 'కోటక్ నేషన్ బిల్డర్స్' కింద ఖాతాను తెరిస్తే మినిమమ్‌ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం అవసరం లేదు. ఇందులో మీకు ఉచిత లాకర్ సౌకర్యం లభిస్తుంది. ఇందులో నెలకు రూ.2 లక్షల నగదు డిపాజిట్ ఉచితంగా, నెలలో 30 లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. ఇందులో రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది. మీరు ప్రమాదంలో పాక్షికంగా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైతే 30 లక్షల బీమా (యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్) కూడా పొందుతారు.

రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ ప్రయోజనాలు

దీని కింద మీరు 'రూపే ప్లాటినం డెబిట్ కార్డ్'ని పొందుతారు. దీని కింద అనేక భారతీయ బ్రాండ్‌లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌లో 4 దేశం, 2 విదేశీ విమానాశ్రయ లాంజ్‌లు అందుబాటులో ఉంటాయి. అంటే మీరు ఈ ఒక్క ఖాతా నుంచి చాలా ప్రయోజనాలను పొందుతారు.

Rama Rao

Rama Rao

Next Story