Top
logo

పరుగులు తీసిన స్టాక్ మార్కెట్! పదేళ్ళలో ఇదే తొలిసారి!!

పరుగులు తీసిన స్టాక్ మార్కెట్! పదేళ్ళలో ఇదే తొలిసారి!!
Highlights

కరోనా ఎఫెక్ట్ తో కొద్ది రోజులుగా 'బేర్' అంటున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు పరుగులు తీశాయి. ఒకటీ రెండూ కాదు...

కరోనా ఎఫెక్ట్ తో కొద్ది రోజులుగా 'బేర్' అంటున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు పరుగులు తీశాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా ఏడు శాతం మేరకు బెంచ్ మార్క్ సూచీలు ఈరోజు (మర్చి 25) దూసుకుపోయాయి. భారత ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు.. లాక్ డౌన్.. అంతర్జాతీయంగా కనిపిస్తున్న సానుకూల పరిస్థితుల నేపధ్యంలో స్టాక్ మార్కెట్ ఎగసిపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై సెనెట్ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు రావడం ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావం చూపిందని నిపుణులు భావిస్తున్నారు.

సెన్సెక్స్ ఏకంగా 2116 పాయింట్ల మేర పరుగులు పెట్టింది. 28,790 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే నిఫ్టీ కూడా 8377 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరకు సెన్సెక్స్ 1862 పాయింట్ల లాభంతో 28,536 పాయింట్ల వద్ద, నిఫ్టీ 497 పాయింట్ల లాభంతో 8,298 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. మార్కెట్ ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం గత పదేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.

స్టాక్ మార్కెట్ కొన్ని విశేషాలు..

- నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూపీఎల్, మారుతీ సుజుకీ షేర్లు పరుగులు తీశాయి.

- ఇక ఫేస్ బుక్ లో రిలయెన్స్ లో 10 శాతం వాటా కొనుగోలు చేయనుందనే సమాచారంతో రిలయన్స్ 14 శాతం దూసుకుపోయింది.

- ఇండస్ఇండ్ బ్యాంక్, ఐఓసీ, కోల్ ఇండియా, విప్రో, గెయిల్ షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు ధర 3 శాతానికి పైగా పడిపోయింది.

- నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 8 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 10 శాతం పరుగులు తీయగా, నిఫ్టీ ఆటో ఇండెక్స్ 4 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 8 శాతం పైకి కదిలాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పెరిగాయి.

- అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 3.09 శాతం తగ్గుదలతో 28.82 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.92 శాతం క్షీణతతో 23.55 డాలర్లకు తగ్గింది.

Web Titlebull run in stock markets first time in ten years in a single day trading
Next Story


లైవ్ టీవి