BP, Reliance To Retail Fuel Under Jio-BP Brand: పెట్రో ఉత్పత్తుల విస్తరణలో బీపీ కంపెనీతో రిలయెన్స్ ఒప్పందం

BP, Reliance To Retail Fuel Under Jio-BP Brand: పెట్రో ఉత్పత్తుల విస్తరణలో బీపీ కంపెనీతో రిలయెన్స్ ఒప్పందం
x
BP, Reliance To Retail Fuel Under Jio-BP Brand
Highlights

BP, Reliance To Retail Fuel Under Jio-BP Brand: గతంలో పెట్రో ఉత్పత్తులు అమ్మకం ప్రారంభించిన రిలయన్స్ తొలినాళ్లలోనే మంచి ప్రగతి సాధించింది. వేల కొలది బంకులను ఏర్పాటు చేసింది

BP, Reliance To Retail Fuel Under Jio-BP Brand: గతంలో పెట్రో ఉత్పత్తులు అమ్మకం ప్రారంభించిన రిలయన్స్ తొలినాళ్లలోనే మంచి ప్రగతి సాధించింది. వేల కొలది బంకులను ఏర్పాటు చేసింది. చిన్నస్థాయి పట్టణాల నుంచి హైవేల్లో సైతం తన సత్తా చాటే విధంగా వీటిని ఏర్పాటు చేసింది. వీటితో పాటు ప్రత్యేకంగా హోటల్స్ ను ఏర్పాటు చేసింది. అయితే కాలక్రమేణా ఏమైందో కాని, వీటి అమ్మకాలపై కాస్త నిర్లక్ష్యం చేసింది. దాదాపుగా చాలా వరకు మూత పడ్డాయి. అయితే ప్రస్తుతం మరోమారు మరో కంపెనీతో కలిసి వీటి అమ్మకాలను చేసేందుకు మరోమారు తెరపైకి వస్తోంది. వీటి అవసరాలకు అనుగుణంగా బంకులను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.

దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పర్యాటక రంగం కుప్పకూలింది. ఈ క్రమంలో పెట్రో ఉత్పత్తుల రిటైల్‌ మార్కెట్లో పోటీ తీవ్రం కాబోతోంది. ఇప్పటి వరకు ఈ మార్కెట్లో ప్రభుత్వ రంగంలోని ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలదే హవా. ఈ కంపెనీలకు మున్ముందు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది.

లండన్ కు చెందిన దిగ్గజ పెట్రో కంపెనీ బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ)తో కలిసి రిలయన్స్‌ గత ఏడాది రిలయన్స్‌ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌ (ఆర్‌బీఎంఎల్‌) పేరుతో ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ 'జియో-బీపీ' పేరు తో తన పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనాల్ని విక్రయించబోతోంది. ఇందుకోసం ప్రస్తుతమున్న 1,400 రిలయ న్స్‌ పెట్రోల్‌ బంకుల్ని వచ్చే ఐదేళ్లలో 5,500కు పెంచాలని నిర్ణయించారు. కాగా భవిష్యత్‌ మార్కెట్‌ను దృష్టి లో పెట్టుకుని రిలయన్స్‌ కార్యకలాపాలు విస్తరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories