Central Health Department on Coronavirus: ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లో కరోనా కేసులు తక్కువే

Central Health Department on Coronavirus: ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లో కరోనా కేసులు తక్కువే
x
Representational Image
Highlights

Central Health Department on Coronavirus: కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందన్నది కొంతమంది సైంటిస్టుల అభిప్రాయ పడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

Central Health Department on Coronavirus: కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందన్నది కొంతమంది సైంటిస్టుల అభిప్రాయ పడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అందుకే ప్రధానమంత్రి ప్రతి ఒక్కరూ రెండు గజాల దూరం పాటించాలని కోరారని చెప్పింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 62 శాతానికి పెరిగిందన్నారు. కరోనా తో చనిపోయిన వారిలో 11 శాతం మంది 30 నుంచి 44 ఏళ్ల వయసు వారే ఉన్నారని స్పష్టం చేసారు. అలగే వారిలో 32 శాతం మంది 45-59 ఏళ్ల వారు, 39 శాతం మంది 60 నుంచి 70 శాతం మధ్య వయసున్న వారు, 14 శాతం మంది 75 ఏళ్ల పై వా రున్నారని తెలిపారు. కరోనా రికవరీ లోమార్చి 15 న 10% శాతం ఉంటే , మే 3 నాటికి 26.59%, మే 31 నాటికి 47.40%, జూలై 9 నాటికి 62శాతంగా ఉందని తెలిపారు.

ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చితే, మిలియన్ జనాభాకు భారతదేశంలో నమోదు అవుతున్న కరోనా వైరస్ కేసులు అతి తక్కువేన్నారు. భారతదేశంలో మిలియన్ జనాభాకు 538 కేసులు ఉంటే, ప్రపంచంలో1497 ఉంది. భారతదేశంలో మిలియన్ జనాభాకు మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందన్నారు. దేశంలో కరోనా వైరస్ పరీక్షల సామర్థ్యం పెంచడానికి పరీక్షా సామర్థ్యాన్ని వేగవంతం చేయడానికి, ప్రైవేట్ ల్యాబ్‌లు ఇప్పుడు NABL అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడ్డాయి. సమాంతరంగా వారి దరఖాస్తును ICMR కు సమర్పించారు, అవి ఒక నెలలో అక్రిడిటేషన్‌ను పూర్తి చేసుకుని పరీక్షలు చేయటానికి అనుమతించబడతాయి. దేశంలో 1,132 పరీక్షా ప్రయోగశాలలు ఇప్పుడు పనిచేస్తున్నాయి.

దేశీయంగా రెండు వ్యాక్సిన్లు చాలా వేగంగా తయారు అవుతూ ప్రయోగ దశలో ఉన్నాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ ల తయారీలో భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో అయితే వ్యాక్సిన్ రావడానికి రెండేళ్లు పడుతుందని తెలిపారు. ఆ సంక్షోభ కాలంలో దీన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలనే కేంద్ర అభిమతం అన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ ఫేస్ వన్, ఫేస్ టు ట్రావెల్స్ ప్రారంభం కాబోతున్నాయి. భారత్ బయోటెక్ తో పాటు క్యాడిలా హెల్త్ కేర్ కూడా దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తుంది. జంతువుల పై ప్రయోగాలు సఫలమయ్యాయని తెలిపారు. ప్లాస్మా థెరపీ చికిత్స డాక్టర్ల మదింపు తర్వాత నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రతి రోజూ 2.66 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉన్నామని స్పష్టం చేసారు. దీన్ని మరింత పెంచేందుకు ప్రైవేట్ ల్యాబ్ లకు కరోనా టెస్ట్ లకు అవకాశం కల్పించామని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories