బరోడా బ్యాంకు ఖాతాదారులకి శుభవార్త.. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించండి..!

Bank of Barodas New Scheme High Interest in Short Period
x

బరోడా బ్యాంకు ఖాతాదారులకి శుభవార్త.. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించండి..!

Highlights

Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకి ఇది శుభవార్తనే చెప్పాలి.

Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ పొందవచ్చు. బ్యాంకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 16న ఓ కొత్త స్కీంని లాంచ్ చేసింది. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ సంపాదించవచ్చు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

'బరోడా తిరంగా' పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంని ప్రారంభించింది. రెండు కాల వ్యవధులకు సంబంధించి ఈపథకాన్ని ఆఫర్ చేస్తోంది. 444 రోజుల కాల వ్యవధిపై ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే 5.75 % వార్షిక వడ్డీని అందిస్తుంది. అలాగే 555 రోజులకు సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్ ప్లాన్ లో 6% వడ్డీని అందిస్తుంది. ఈ స్కీం డిసెంబర్ 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

అయితే సీనియర్ సిటిజన్ లు మరో 0.50% అదనపు వడ్డీ రేటును పొందే అవకాశం ఉంది. నిర్ణీత గడువు వరకు డిపాజిట్ ను ఉంచితే మరో 0.15% వడ్డీ రేటును అదనంగా చెల్లిస్తారు. దేశంలోని అత్యంత నమ్మదగిన బ్యాంకుల్లో బరోడా బ్యాంక్ ఒకటి. ఖాతాదారుల కోసం తరచూ కొత్త కొత్త పథకాలని ప్రారంభిస్తుంది. అలాగే స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎస్బీఐ కూడా ఉత్సవ్ పేరుతో ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories