Bride Online: పెళ్లికోసం ఆన్‌లైన్‌లో వధువుని వెతుకుతున్నారా.. ఈ ట్రాప్‌లో పడితే అస్సలు కోలుకోలేరు..!

Bride Online: యువకులకి అలర్ట్‌.. పెళ్లికోసం ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా వధువుని వెతుకుతున్నారా అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

Arun Chilukuri
Updated on: 8 Aug 2023 8:30 PM IST
Are you Looking for a Bride Online for Marriage If you Fall Into This Trap you Will Lose Crores of Rupees
X

Bride Online: పెళ్లికోసం ఆన్‌లైన్‌లో వధువుని వెతుకుతున్నారా.. ఈ ట్రాప్‌లో పడితే అస్సలు కోలుకోలేరు..!

Bride Online: యువకులకి అలర్ట్‌.. పెళ్లికోసం ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా వధువుని వెతుకుతున్నారా అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సర్వం కోల్పోతారు. ఇంటర్నెట్‌ వల్ల ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా ఉంటాయి. అవి తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన అనేక కేసులు తెరపైకి వస్తున్నాయి. కొంతమంది బంధువులు, స్నేహితులమంటూ చెప్పి డబ్బు దోచేస్తున్నారు. మరికొంతమంది స్కామర్‌లు కాల్స్‌, మెస్సేజ్‌ల ద్వారా సంప్రదించి మోసం చేస్తున్నారు. ఇక కొందరైతే డేటింగ్ సైట్లు, మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి ఒక సంఘటన గురించి ఈరోజు తెలుసుకుందాం.

బ్రిటన్‌కి చెందిన ఒక వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ పనికోసం ఇటీవల బెంగళూరు వచ్చాడు. అతడు వివాహ ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. అందులో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ నంబర్లు మార్చుకున్నారు. ఇంకేముంది ఇద్దరి మధ్య మాటలు, మెస్సేజ్‌లు మొదలయ్యాయి. అయితే ఇద్దరికీ ఒకరికొకరు తెలియదు చూసుకోలేదు. తన తల్లితో కలిసి జీవిస్తున్నట్లు ఆ మహిళ పేర్కొంది. అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

తర్వాత ఒకరోజు తన తల్లి ఆరోగ్య పరిస్థితిని సాకుగా చూపి రూ.1500 అప్పు తీసుకుంది. మరొక రోజు ఏకంగా దుస్తులు విప్పేసి న్యూడ్‌ కాల్‌ చేసింది. అంతేకాదు ఆ వీడియో కాల్ మొత్తాన్ని రికార్డ్ చేసింది. తర్వాత ఆ వీడియోలో ఇద్దరు ఉండే ప్రింట్ షాట్‌లను వ్యక్తికి పంపింది. ఇక డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. లేదంటే ఈ క్లిప్‌ను అతని తల్లిదండ్రులకి షేర్‌ చేస్తానని బెదిరించింది. దీంతో సదరు వ్యక్తి రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు కలిపి రూ.1,14,00,000 పంపించాడు. తర్వాత ఆ వ్యక్తి పోలీసులని ఆశ్రయించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story