Life Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్లకి అలర్ట్.. పాలసీ విషయంలో మార్పు గమనించకుంటే నష్టపోతారు..!
Life Insurance: జీవితంలో ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.
Life Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్లకి అలర్ట్.. పాలసీ విషయంలో మార్పు గమనించకుంటే నష్టపోతారు..!
Life Insurance: జీవితంలో ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. అది హెల్త్ ఇన్సూరెన్స్ పర్వాలేదు లైఫ్ ఇన్సూరెన్స్ అయినా పర్వాలేదు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల మెచ్యూరిటీ ప్రయోజనాలు, మరణ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పాలసీ విషయంలో ఒక పెద్ద అప్‌డేట్ జరిగింది. ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ప్రీమియం చెల్లించడం ఆదాయపు పన్ను శాఖ కిందికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించి పాలసీ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
లైఫ్ ఇన్సూరెన్స్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను చట్టం 2023ని నోటిఫై చేసింది. ఇందులో జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీపై వచ్చిన మొత్తానికి సంబంధించి ఆదాయాన్ని గణించడానికి రూల్ 11UACA నిర్దేశించారు. ఈ నిబంధన ప్రీమియం ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న పాలసీలకి వర్తిస్తుంది. సవరణ ప్రకారం ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేసిన పాలసీలకు సెక్షన్ 10(10D) కింద పన్ను మినహాయింపు ఐదు లక్షల రూపాయల కంటే తక్కువ చెల్లించినవారికి మాత్రమే వర్తిస్తుంది.
పన్ను నిబంధనలు
ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్) మినహా జీవిత బీమా పాలసీలకు సంబంధించి పన్ను కేటాయింపుల గురించి బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఫార్ములా ప్రకారం మెచ్యూరిటీలో పొందే మిగులు మొత్తం 'ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం' కింద భావించి పన్ను విధిస్తారు. జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించినప్పుడు మాత్రం మునుపటిలాగా ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.


