7th Pay Commission: ఉద్యోగులకి అలర్ట్‌.. 7వ పే కమిషన్ అప్‌డేట్‌ తెలియకుంటే నష్టపోతారు..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7వ పే కమిషన్ ప్రకారం జీతం పొందుతారు.

Arun Chilukuri
Updated on: 26 Aug 2023 11:30 AM IST
Alert to Employees Know Complete Information About 7th Pay Commission Update
X

7th Pay Commission: ఉద్యోగులకి అలర్ట్‌.. 7వ పే కమిషన్ అప్‌డేట్‌ తెలియకుంటే నష్టపోతారు..!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7వ పే కమిషన్ ప్రకారం జీతం పొందుతారు. పే కమిషన్‌ అనేది ఉద్యోగుల జీతానికి సంబంధించిన ఒక నిర్మాణం. ఇందులో జీతం, అలవెన్సులు, బోనస్‌, ఇతర సౌకర్యాలు అన్నిటిని పరిగణలోనికి తీసుకుంటారు. 7వ పే కమిషన్ ప్రకారం కనీస వేతనం నెలకు రూ.7,000 నుంచి రూ.18,000కి పెంచారు. కొత్తగా రిక్రూట్ అయిన క్లాస్ I అధికారికి ఇప్పుడు కనీస వేతనం నెలకు రూ.56,100 చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు 7వ పే కమిషన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

గరిష్ట వేతనం

సెక్రటేరియట్/సమాన స్థాయిలో ఉండే ఉద్యోగులకి గరిష్ట వేతనం అపెక్స్ స్కేల్‌కు నెలకి రూ.2,25,000 ఉంది. ప్రస్తుతం అదే వేతన స్థాయిలో ఉన్న క్యాబినెట్ సెక్రటరీ, ఇతరులకు నెలకు రూ.2,50,000గా ఉంది. ఇక వార్షిక ఇంక్రిమెంట్ రేటు 3% కేటాయించారు.

కొత్త నిర్మాణం

ప్రస్తుతం ఉన్న పే బ్యాండ్‌లు, గ్రేడ్ పే వ్యవస్థ రద్దు చేసి కొత్త పే మ్యాట్రిక్స్ రూపొందించారు. ఇప్పటివరకు గ్రేడ్ పే ద్వారా నిర్ణయించిన ఉద్యోగి స్థితిని ఇప్పుడు పే మ్యాట్రిక్స్‌లోని స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. అలాగే 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉద్యోగులందరికీ ఒకే విధంగా వర్తింపజేయాలని ప్రతిపాదించారు.

మిలిటరీ సర్వీస్ పే

గతంలో బ్రిగేడియర్‌లు వారికి సమానమైన అన్ని ర్యాంక్‌ల ఉద్యోగులకి మిలిటరీ సర్వీస్ పే (MSP) చెల్లించేవారు. ఇప్పుడు రక్షణ దళాల సిబ్బందికి మాత్రమే ఇది వర్తిస్తుంది. MSP అనేది సైనిక సేవకు పరిహారం వివిధ వర్గాలకు MSPని పెంచాలని సిఫార్సు చేశారు.

మోడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (MACP)

MACP పనితీరు బెంచ్‌మార్క్‌ని వెరీ గుడ్ గా సెట్ చేశారు. MACPకి అర్హత సాధించిన ఉద్యోగులకు వారి మొదటి 20 సంవత్సరాలలో రెగ్యులర్ ప్రమోషన్ కోసం వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వకూడదని ప్రతిపాదించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story