Petrol Rate: వరుసగా ఎనిమిదో రోజు పెట్రో ధరల మోత!

* ముంబైలో రూ.96కు చేరువలో లీటర్‌ పెట్రోల్ ధర * హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.84

Sandeep Eggoju
Published on: 16 Feb 2021 9:34 AM IST
8th day of petrol Price hike in Indian Metro Citys
X

Representational Image

దేశంలో పెట్రో ధరలు మోత మోగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో తొలిసారిగా లీటర్ పెట్రోల్ ధర 89 రూపాయల మార్క్ కు చేరగా ముంబైలో 96 రూపాయలకు చేరువలో పరుగులు పెడుతోంది. దేశంలోని మెట్రో నగరాల్లో వరుసగా ఎనిమిదో రోజు ఇంధన ధరలు పెరిగి సరికొత్త గరిష్ఠాలను తాకాయి. గత వారం రోజులుగా పెట్రోల్ ధర లీటరుకు రూపాయి 95 పైసలు, డీజిల్ లీటరుకు రూపాయి 65 పైసలు చొప్పున పెరిగాయి. పెట్రోలియం కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 26 నుంచి 30 పైసలు డీజిల్ పై 33 నుంచి 38 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 89 రూపాయల 29 పైసలు, డీజిల్ 79 రూపాయల 70 పైసలు వద్దకు చేరాయి. ఆర్దిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 95 రూపాయల 75 పైసలుగా నమోదవుతోంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 92 రూపాయల 84 పైసలు, డీజిల్ 86 రూపాయల 93 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story