Gold, Silver Price Today: స్థిరంగా బంగారం ధరలు

Gold Price Today: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి.

Kranthi
Published on: 23 May 2021 6:31 AM IST
24 Carat Gold Rate Today 23 05 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం.. రూ.46,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 47,000 కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 46,930 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,830 గా కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,000 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద ఉంది. చెన్నైలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,050 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,750 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఆదివారం కూడా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతటా.. కిలో వెండికి 100 రూపాయల మేర తగ్గింది. కాగా.. ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం రూ.700 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర 71,100 రూపాయల వద్ద కొనసాగుతోంది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,100 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,100 గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700 ఉంది. ఇక్కడా, తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. బెంగళూరులో రూ.71,100 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.75,700 లు ఉంది. విజయవాడలో వెండి రూ.75,700 వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story