Gold, Silver Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు....ఎంత తగ్గాయంటే..

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

Kranthi
Published on: 19 Jun 2021 7:02 AM IST
22ct Gold Price Today in Hyderabad 19 06 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. గత వారం నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. తాజాగా బంగారం ధరల్లో మార్పులేమీ చోటుచేసుకోలేదు. దేశంలో స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం బంగారం ధర భారీగా తగ్గింది. శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర మేర రూ. 48,350 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ.600 మేర తగ్గి.. 47,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 51,490 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,350 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,350 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,250 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,250 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,250 వుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,250 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,270 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,270 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. బంగారం ధరలు దిగివస్తుండగా, వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. దేశీయంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండికి 1700 రూపాయల మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర 68,600 రూపాయలకు పతనమైంది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 68,600 గా ఉంది. బెంగళూరులో రూ.68,600 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,600 వద్ద ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో వెండి కిలో రూ.74,000 లు ఉండగా,విజయవాడలో వెండి రూ.74,000లు వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story