Gold, Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: దేశీయంగా10 గ్రాముల బంగారంపై రూ.450 పెరగ్గా కిలో రూ.1100 వరకు ఎగబాకింది.

Kranthi
Published on: 2 July 2021 9:29 AM IST
22ct Gold Price Today in Hyderabad 02 07 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు బంగారం వెండి ధరలు భారీగా నే పెరిగాయి.. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. శుక్రవారం దేశీయంగా10 గ్రాముల బంగారంపై రూ.450 వరకు పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.1100 వరకు ఎగబాకింది

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,190 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,470 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం ధరలు పెరగ్గా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. తాజాగా ఇక వెండి ధరల్లో కూడా దేశీయంగా రూ.1100 వరకు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో రూ.1200 వరకు పెరిగింది

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, చెన్నైలో రూ.74,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, కోల్‌కతాలో రూ.68,700 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, కేరళలో రూ.68,700 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,100 ఉండగా, విజయవాడలో రూ.74,100 వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-07-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story