Gold Rates Today 23.10.2019 : మరింత తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు!

బంగారం ధరలు బుధవారం మరి కొంచెం దిగొచ్చాయి.23.10.2019 బుధవారం పది గ్రాముల బంగారం ధర మంగళవారం తో పోలిస్తే 150 రూపాయల వరకూ తగ్గింది. కాగా వెండి ధరలు మాత్రం పైకెగశాయి.
బంగారం ధరలు బుధవారం మరి కొంచెం దిగొచ్చాయి.23.10.2019 బుధవారం పది గ్రాముల బంగారం ధర మంగళవారం తో పోలిస్తే 150 రూపాయల వరకూ తగ్గింది. కాగా వెండి ధరలు మాత్రం పైకెగశాయి.
బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 150 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,800 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 150 రూపాయలు తగ్గింది. ఈ తగ్గుదలతో 36,470 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక మూడురోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర బుధవారం కేజీకి 500 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,500 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,800 , 2వ2 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,470 రూపాయలుగానూ ఉన్నాయి.
ఢిల్లీ మార్కెట్లో కూడా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు తగ్గింది. దీంతో 38,450 రూపాయల వద్ద 24 క్యారెట్ల బంగారం ధర నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 150 రూపాయలు తగ్గడంతో 37,250 రూపాయల వద్దకు తగ్గింది. ఇక వెండి ధర ఇక్కడ కూడా కేజీకి 500 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,500 రూపాయలు వద్ద నిలిచింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 23.10.2019 బుధవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది
లైవ్ టీవి
డీఆర్డీఓలో 1817 ఉద్యోగాలు
13 Dec 2019 11:26 AM GMTనన్ను ఎర్రగడ్డకు పంపిస్తే.. అచ్చెన్నాయుడుని వెటర్నరీ...
13 Dec 2019 11:21 AM GMTపౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు
13 Dec 2019 11:09 AM GMTజనవరిలో పసుపు రైతులు శుభవార్త వింటారు : అరవింద్
13 Dec 2019 10:54 AM GMTశుభవార్త..శాంతిస్తున్న ఉల్లి ధరలు!
13 Dec 2019 10:39 AM GMT