ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ
x
Highlights

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలపై అనుచితవ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ దీనిపై వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలపై అనుచితవ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ దీనిపై వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. కాగా ఇటీవల ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక ఛానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమపై అసభ్య పదజాలంతో దూషించారని ఎమ్మెల్యేలు వైసీపీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. దాంతో అధిష్టానం ఈ చర్యలు చేపట్టింది. కాగా గత కొన్ని రోజులుగా రఘురామకృష్ణంరాజు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

వైసీపీ ఎంపీగా ఉంటూ.. ప్రభుత్వంపైనే అవినీతి ఆరోపణలు చేశారు, అంతేకాదు పార్టీలో పదవులు ఒక సామాజికవర్గం వారే పంచుకుంటున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై ఫిర్యాదు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. అయితే రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై ఆ పార్టీ నేతలు సీరియస్ అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా పచ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్ధాలు అని అన్నారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలకు మధ్య వివాదం ముదిరింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories