విశాఖ పశ్చిమ బరిలో ఒకే సామాజికవర్గం అభ్యర్థులు...మరి విజయం ఎవరిది?

విశాఖ పశ్చిమ బరిలో ఒకే సామాజికవర్గం అభ్యర్థులు...మరి విజయం ఎవరిది?
x
Highlights

సాగరతీరంలో పడమటి రాగం ఎవరికి కలసి వస్తుంది పశ్చిమంలో పచ్చ జెండా పాగా వేస్తుందా లేక ఫ్యాన్ గాలి వీస్తుందా. విశాఖలో పశ్చిమ నియోజకవర్గంలో ఇదే ఇప్పుడు...

సాగరతీరంలో పడమటి రాగం ఎవరికి కలసి వస్తుంది పశ్చిమంలో పచ్చ జెండా పాగా వేస్తుందా లేక ఫ్యాన్ గాలి వీస్తుందా. విశాఖలో పశ్చిమ నియోజకవర్గంలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. సార్వత్రిక ఎన్నికల్లో సమీకరణాలు, ఓటింగ్ సరళి అభ్యర్థుల గుణగణాలు, గెలుపు అవకాశాలు ఇలా వైజాగ్‌ వెస్ట్‌లో ఎటు చూసినా ఇదే చర్చ. విశాఖ పశ్చిమంలో పోలిటికల్ హీట్‌పై స్పెషల్ రిపోర్ట్.

2009 లో ఏర్పడింది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం. విలీన ప్రక్రియలో భాగంగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,36,310 మంది ఓటర్లు వున్నారు. పురుషులు 1,21,810, మహిళలు 1,14,492 మంది. 2009 నుండి జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే, 2009లో టీడీపీ నుండి గుడివాడ నాగమణి, పీఆర్పీ నుండి గణబాబు, కాంగ్రెస్ నుండి మళ్ల విజయప్రసాద్ బరిలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్ది మళ్ల విజయప్రసాద్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి గణబాబు, వైసీపీ నుండి దాడి రత్నాకర్ పోటీపడగా, సామాజిక వర్గం, టీడీపీ హవాతో గణబాబు గెలుపొందారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి మరోసారి గణబాబు పోటీలో వుండగా, వైసీపీ నుండి మళ్ల విజయప్రసాద్ బరిలో నిలిచారు. దీంతో ఇద్దరు అభ్యర్ధుల మధ్య హారాహోరీ పోరు సాగింది.

ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు. అయితే గణబాబు కుటుంబం దశాబ్ధాలుగా ఆ ప్రాంత ప్రజలతో మమేకమై ఉన్నారు. మరోవైపు మళ్ల విజయ ప్రసాద్ కూడా 2009 లో ఎమ్మెల్యేగా మంచి పేరునే సంపాదించారు. దీంతో ఇద్దరికి విజయావకాశాలు సమానంగా వుండటంతో పశ్చిమ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories