కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సెటైర్లు

Samba Siva Rao
Published on: 26 May 2020 7:55 PM IST
కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సెటైర్లు
X
Chandrababu Naidu (file Photo)

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మార్చి 20న అమరావతి నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ సోమవారం ఏపీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కరోనా వీరులు కరకట్ట మీద వాలారట! ఇక కృష్ణా నదికి కూడా కోవిడ్ టెస్టులు చేయాలేమో! అంటూ ట్వీట్ చేశారు. సలహాలు, సూచనలు అంటూ జూమ్‌లో రోజూ ఊదరగొట్టావు కదా అని ఎద్దేవాచేశారు. వైఎస్‌ జగన్ ఏడాది పాలనపై స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురుచూశారూ కానీ, మీరు అలా కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ? అంటూ ఎద్దేవా చేశారు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story