కొత్త కార్లు గురూ! ఈ సెప్టెంబర్ లో విడుదలవుతున్నాయి.

కొత్త కార్లు గురూ! ఈ సెప్టెంబర్ లో విడుదలవుతున్నాయి.
x
Highlights

కొత్త కారు కొందామని అనుకుంటున్నారా? ఈ నెలలో విడుదల కాబోతున్న కొత్త కార్లను కూడా చూసి డిసైడ్ అయిపోండి

త్త కారు కొందామని అనుకుంటున్నారా? ఇప్పటికే బోలెడన్ని కంపెనీలు.. కావలసినన్ని మోడల్స్.. ఎన్నో చూసి ఉంటారు. కానీ, కొత్తగా కారు కొనుక్కునేటప్పుడు లేటెస్ట్ గా వచ్చింది కొనుక్కుంటే ఆ కిక్కే వేరు కదా. పైగా కొనేది కారు.. మళ్లీ మళ్లీ మార్చుకునేది కాదు. అందుకే ఈ నెలలో విడుదల కాబోతున్న కొత్త కార్ల విశేషాలు మీకోసం..

వోక్స్ వాగన్ పోలో/వేంటో ఫేస్ లిఫ్ట్

ఏరోజు విడుదలవుతోంది: సెప్టెంబర్ 4, 2019

ధర ఇంత ఉండొచ్చు: పోలో.. 5.7 లక్షల నుంచి 9.8 లక్షల వరకూ! వేంటో.. 8.6 లక్షల నుంచి 14.5 లక్షల వరకూ!!

వోక్స్ వాగన్ ఇప్పుడు విడుదల చేయబోతున్న ఈ కార్లు అన్ని రకాల పరీక్షలను ఎదుర్కుని నిలబడ్డాయి. ఫేస్ లిఫ్ట్ వోక్స్ మొదటి కార్లు కావు. పోలో, వెంటో కొత్త డిజైన్ తో పలకరించబోతున్నాయి. డిజైన్ ఒక్కటే కాకుండా.. ఈ కార్లు BS6 ప్రమాణాలతో పెట్రోల్ వెర్షన్లో కొత్త 1.0 లీటర్ల టర్బో ఇంజన్ తో వస్తున్నాయి.


రెనాల్ట్ క్విడ్

ధర ఇంత ఉండొచ్చు: 2.8 లక్షల నుంచి 4.75 లక్షల వరకూ!

రెనాల్ట్ క్విడ్ అప్ డేటెడ్ వెర్షన్ విడుదలకు సంబంధించి తేదీ ప్రకటించలేదు కానీ, సెప్టెంబర్ లో విడుదల అవుతుందని చెబుతున్నారు. ఈ కారు ప్రస్తుతం ఉన్న కారులానే ఉంటుంది కానీ, డిజైన్ లో చాలా మార్పులు చేశారు. దీని లుక్ City K-ZEని పోలి ఉంటుంది. దీనికి అమర్చిన ఎలక్ట్రిక్ ఎల్యీడీ ఎలిమెంట్స్ తో కూడిన డిజైన్ ఆకట్టుకునేలా ఉంటుంది.



హ్యుందాయ్ ఎలేన్ట్రా

ధర ఇంత ఉండొచ్చు: 14 లక్షల నుంచి 20 లక్షల వరకూ!

ఇది కూడా కొత్త కారు కాదు కానీ డిజైన్ అప్డేట్ చేసి విడుదల చేస్తున్నారు. సెడాన్ లాంటి లుక్ తో ఈ కొత్త డిజైన్ వస్తోంది. ప్రస్తుతం 1.5 లీటర్ల డీజిల్ ఇంజన్ తో వస్తున్నా ఈ కారు 1.6 హ్యుందాయ్ కార్లలో ఎక్కువగా ఉపయోగిస్తున్న లీటర్ల డీజిల్ ఇంజన్ కి అప్ గ్రేడ్ అవుతుంది. ఈ కారు విడుదల తేదీ కూడా ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ నెలలోనే కారు షోరూమ్ లలో వస్తుందని చెబుతున్నారు.



మారుతి సుజుకి ఎస్-ప్రేస్సో

ధర ఇంత ఉండొచ్చు: 4 లక్షల నుంచి ఉండొచ్చని చెబుతున్నారు.

ఈ కారు కూడా సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం అయింది. అయితే, కొంచెం ఆలస్యంగా వచ్చే నెల మొదటి వారంలో విడుదల కావచ్చు. రెనాల్ట్ క్విడ్ లాంటి కారిది. SUV మోడల్స్ లో వుండే హచ్ బాక్ ఫేసిలిటితో వస్తున్న చిన్న కారు ఇది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ కారుతో పోటీగా ఉంటుందో చెప్పలేం కానీ ఆటో ఎక్స్పో 2018 లో ఈ కారు ప్రదర్శన చూసిన దానిని బట్టి భవిష్యత్ ఎస్ కాన్సెప్ట్ తో కారు వస్తోందని చెప్పవచ్చు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories