అందుకే ఎవరూ కార్లు కొనడం లేదట!

అందుకే ఎవరూ కార్లు కొనడం లేదట!
x
Highlights

ఈ శతాబ్దపు యువత కార్లు కొనేందుకు ఆసక్తి చూపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర...

ఈ శతాబ్దపు యువత కార్లు కొనేందుకు ఆసక్తి చూపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న తరుణంలో అందుకు గల కారణాల పై ఆమె మాట్లాడారు. ప్రస్తుతం కుర్రకారు ప్రయాణాలకు ఓలా, ఊబర్ వంటి సంస్థలను ఆశ్రయిస్తున్నారానీ, కారు కొని నెల నేలా ఈఎంఐ లు కట్టుకునే భారం కంటే అదే సులువని భావిస్తున్నారానీ ఆమె చెప్పుకొచ్చారు. ఆటోమొబైల్ రంగ క్షీణతకు ఈ మార్పు కారణమవుతోందని ఆమె అంటున్నారు. ఇక ట్రక్కుల విషయంలో 0 శాతం తక్కువ అమ్మకాలు నమోదు కావండ ఆందోళన కలిగించే అంశమని ఆమె అన్నారు. దీని వలన లక్షలాది ఉద్యోగాలకు ముప్పు వచ్చిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఉద్దీపన చర్యలు ప్రవేశపెట్టామన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories